జగనన్న సురక్ష కార్యక్రమం కార్యాచరణపై సీఎం ఆదేశాలు
TeluguStop.com
ఏపీలో ఈనెల 23వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ క్రమంలో కార్యాక్రమం కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం జగన్ పలు అంశాలపై చర్చించారు.
సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లాలని నేతలకు ఆదేశించారు.ఏ పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.
జగనన్న సురక్ష కోసం ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం యాప్ లో 11 అంశాలను ప్రస్తావించారు.
కాగా 11 అంశాల వారీగా సమస్యలను పరిష్కరించనున్నారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!