సి.ఎం.ఆర్.బియ్యం ఎఫ్.సి.ఐకి మే 31 వరకు అందించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో 2020-21 రబీ సంవత్సరానికి సంబంధించిన సి.ఎం.

ఆర్.బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు సత్వరమే ఈ నెల 31 నాటికి అందించాలని జిల్లా కలెక్టర్ టి.

వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లాలోని మిల్లర్లు,సంబంధిత శాఖ అధికారులతో రబీ,2020 -21 సి.

ఎం.ఆర్.

బియ్యంపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ 2020-21 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం జిల్లాలో 72 మిల్లులకు అందించగా ఇప్పటివరకు 48 మిల్లులు నూరు శాతం సి.

ఎం.ఆర్.

బియ్యం ఎఫ్.సి.

ఐకి అందించారని, అలాగే మిగతా 24 మిల్లులు సి.ఎం.

ఆర్.బియ్యం పూర్తి స్థాయిలో అందించలేకపోవడంపై మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఈ నెల 31 వరకు సి.ఎం.

ఆర్.గడువు పెంచడం వలన బియ్యం అందించని మిల్లర్లు ఆదిశగా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.

అదే విధంగా మిల్లర్లు సి.ఎం.

ఆర్.బియ్యానికి సంబంధించి వ్యవపట్టికలు సరిచూసుకోవాలని,అలాగే ఎప్పటికప్పుడు సంబంధిత నివేదికలు కార్యాలయంలో అందించాలని సూచించారు.

సి.ఎం.

ఆర్.బియ్యం అందించని మిల్లుల వారీగా అదనపు కలెక్టర్,సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.

80 నుండి 99 శాతం ఉన్న 12 మిల్లులు నూరు శాతం పూర్తిచేసి ఎఫ్.

సి.ఐకి సత్వరమే సి.

ఎం.ఆర్.

బియ్యం పెట్టాలని అలాగే సి.ఎం.

ఆర్.పూర్తి చేసిన మిల్లర్లతో షేరింగ్ చేసుకొని నిర్దేశించిన గడువు లోపు అందించాలని,బకాయి మిల్లర్లకు సూచించారు.

అదేవిధంగా 2021 రబీకి సంబంధించి సి.ఎం.

ఆర్.బియ్యం కూడా ఎఫ్.

సి.ఐకి పెట్టాలని మిల్లర్లకు సూచించారు.

ఈ సమావేశంలో డి.ఎస్.

ఓ విజయలక్ష్మి,డి.ఎం.

రాంపతి నాయక్,డి.ఎస్.

ఓ పుల్లయ్య,డి.టి.

లు,జిల్లా మిల్లర్స్ అధ్యక్షులు రవీంద్ర,మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇండస్ట్రీలో బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్న నటీనటులు