తుపాను, భారీ వర్షాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
TeluguStop.com
తుపాను, భారీ వర్షాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సీఎం వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్.
కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం.సీఎం వైయస్.
జగన్ కామెంట్స్:కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలి:ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా వ్యవహరించండి:ఎక్కడా రైతులు నిరాశకు గురికాకూడదు :రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదు:తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదు:ఒకవేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే, వారికి రావాల్సిన రేటు వారికి రావాలి:ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదే.
తుపాను, దాని ప్రభావం వల్ల వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అందరూ దీనికోసం చర్యలు తీసుకోవాలి:పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలి :పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు అందించాలి :ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే.
ఆ కుటుంబానికి రూ.2వేల రూపాయలతోపాటు, రేషన్ అందించాలి:ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే.
ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదు:నీళ్లు ఇంటిలోకి వచ్చి ఉంటే.కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందే :ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలి:పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఈ సహాయాన్ని బాధితులందరికీ అందించాలి:గోడకూలి ఒకరు మరణించారన్న ఘటన జరిగినట్టుగా సమాచారం వచ్చింది:వారికి కూడా పరిహారం వెంటనే అందించాలి:వారంరోజుల్లో ఈ సహాయం అంతా వారికి అందాలి :ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలి:నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలి :వచ్చే వారంరోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలి : అధికారులకు స్పష్టం చేసిన సీఎం శ్రీ వైయస్.
జగన్.ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి వై మదుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్, డిజాస్టర్‌మేనేజిమెంట్ డైరెక్టర్ బీ ఆర్ అంబేద్కర్,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులు హాజరయ్యారు.
వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!