ఇదేంటి జగనన్నా… మ్యానిఫెస్టో షాక్ ఇచ్చిందిగా..? 

ఏపీ అధికార పార్టీ వైసిపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో( YSRCP Election Menifesto ) పై సొంత పార్టీ నేతల్లోనే పెదవిరుపులు కనిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో జనాలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిన జగన్ ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని అంతా అంచనా వేశారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించింది.పెన్షన్లను 4000 రూపాయలు చేస్తామని ప్రకటించారు.

  అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని సైతం ప్రకటించారు.అయితే జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో పెన్షన్ 3500 ఇస్తామని చెప్పడాన్ని వైసిపి నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒకపక్క చంద్రబాబు 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించగా.

  జగన్ 3,500 అది కూడా 2024లో 250 రూపాయలు పెంచి మళ్ళీ 2029 లో 250 రూపాయలు పెంచుతాము అంటే ఎవరు ఓట్లు వేస్తారని ప్రశ్నిస్తున్నారు.

"""/" / అసలు రైతు రుణమాఫీ( Farmer Loan Waiver ) ప్రస్తావన లేకుండా జగన్ పెద్ద తప్పు చేశారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు .

ఇప్పుడున్న లబ్ధిదారులు కూడా ఎవరు ఎక్కువ నగదు ఇస్తే వారికే ఓట్లు వేసే పరిస్థితి ఉందని , తాము చేయాల్సింది చేస్తామని జనం ఎంతవరకు జగన్( CM Ys Jagan ) ప్రకటించిన మేనిఫెస్టో పై సానుకూలంగా స్పందిస్తారనేదే ప్రశ్నగా వైసీపీ నేతలకు  మారింది.

ఈరోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ ఎన్నికల మేనిఫెస్టోను  విడుదల చేశారు.

కేవలం రెండు పేజీలతో మ్యానిఫెస్టో విడుదల చేశారు.ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే కొనసాగిస్తూ వాటిని కి మరో కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు.

"""/" / ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలపై ప్రజల్లో సంతృప్తి ఉందని,  మరోసారి తమను ఆదరిస్తారనే అంచనాతో జగన్ ఉన్నారు.

కానీ మెజార్టీ వైసిపి నేతల్లో జగన్ ప్రకటించిన మేనిఫెస్టో పై అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

అలాగే ప్రజల్లోనూ ఈ మేనిఫెస్టో పై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

వీడియో: సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ చూసి ఆగ్రహించిన స్టూడెంట్ తల్లి..??