కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు సీఎం వైయస్‌.జగన్‌ ఫోన్‌

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు సీఎం వైయస్‌.జగన్‌ ఫోన్‌ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై చర్చ తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని వివరించిన జయశంకర్‌ ఉక్రెయిన్‌ పక్కదేశాలకు తరలించి అక్కడనుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామన్న కేంద్రమంత్రి.

అంతకుముందు సీఎం ఉన్నతస్థాయి సమావేశం.ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.

కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశం రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలన్న సీఎం కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలన్న సీఎం అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలన్న సీఎం అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారానికి ఆదేశం.

గాయం బాధ పెడుతున్న డాన్స్ కుమ్మేసావు.. ఎన్టీఆర్ డాన్స్ పై సినిమాటోగ్రాఫర్ కామెంట్స్!