Juvvaladinne Fishing Harbor : ఏపీలో మత్స్యకారులకు భరోసా.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం
TeluguStop.com
ఏపీలో మత్స్యకారులకు( Fishermen ) మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.ఈ మేరకు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్( Juvvaladinne Fishing Harbor ) ప్రారంభమైంది.
రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్( Fishing Harbor ) ను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ క్రమంలో ఓఎన్జీసీ పైప్ లైన్ తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందజేశారు.
ఇందుకోసం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.161.
86 కోట్లను సీఎం జగన్ ( CM YS Jagan )జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మత్స్యకారులకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.డీజిల్ సబ్సిడీ రూ.
6 నుంచి రూ.9 కి పెంచామన్నారు.
గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అందిన సాయం రూ.104 కోట్లు మాత్రమేనని తెలిపారు.