ప్రభుత్వ అధికారులను అభినందించిన సీఎం వైఎస్ జగన్..!!

ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ విద్యాశాఖ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించే రీతిలో.విప్లవాత్మక మార్పులు చేర్పులు చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

చదువు పరంగా మాత్రమే కాక.విద్యార్థికి పాఠశాల వాతావరణం కూడా అనువుగా ఉండేవిధంగా "నాడు-నేడు" అనే కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చటం జరిగింది.

ఇదే తరుణంలో పాఠశాలల విషయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో.ప్రభుత్వ అధికారులు కీలకంగా వ్యవహరించాలని ప్రతి విద్యా శాఖ సమీక్ష సమావేశంలో జగన్ తెలియజేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు తాజాగా.పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ.

వ్యవహరిస్తున్న తీరును.అభినందిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి సంచలన కామెంట్ పెట్టారు.

వైయస్ జగన్ చేసిన కామెంట్ ఈ రీతిగా ఉంది."ఇటీవల విద్యాశాఖ సమీక్షలో నేను ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల్లో నాణ్యమైన వసతుల కల్పనకు అధికారులు తీసుకుంటున్న చొరవ అభినందనీయం.

ఇంట్లో మనం తినే భోజనం ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటామో అంతే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు అధికారులు సైతం అంతే తపన పడుతున్నారు.

మనం ఉండే ఇంటి పరిసరాలు, టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలని మనం ఆశించినట్టుగానే బడిలో టాయిలెట్స్ కూడా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

ఈ సంకల్పాన్ని అధికారులు ముందుకు తీసుకువెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.అంటూ.

ప్రభుత్వ అధికారులు విద్యార్థులతో కలిసి వారితో ముచ్చటిస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

నా చర్మం వలిచి చెప్పులు కుట్టించి .. కోమటిరెడ్డి ఎమోషనల్ కామెంట్స్