CM Jagan : అప్పుడు శ్రీలంక అవ్వదా బాబు ? ఆ హామీలపై జగన్ సూటి విమర్శలు 

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ఇస్తున్నాయి.

2019 ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను దాదాపు 98% అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రకటిస్తుండగా, టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) సైతం భారీ హామీలే ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే రెట్టింపు స్థాయిలో పథకాలను అందిస్తామని, ప్రతి ఒక్కరిని కోటీశ్వరుడిని చేస్తామంటూ పదేపదే చెబుతున్నారు.

అయితే చంద్రబాబు ఇస్తున్న హామీలపై జగన్ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ చంద్రబాబును ఎద్దేవా చేస్తున్నారు.

చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని, ఎటూ ఆ హామీలను నెరవేర్చే ఉద్దేశం లేదు కాబట్టే ఆయన దేశంలో అన్ని రాష్ట్రాల హామీలను తెచ్చి ఏపీలో జనం మీద కురిపిస్తున్నారని జగన్ విమర్శించారు.

"""/" / చంద్రబాబు తమ జీవితంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే చరిత్ర లేదని జగన్ విమర్శిస్తున్నారు.

చంద్రబాబు ఇస్తున్న హామీల విలువను లెక్కలు కట్టి జగన్( YS Jagan Mohan Reddy ) ప్రజలకు వివరిస్తున్నారు.

తమ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వంలో అమలు చేయడానికి ఏటా 70 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, వాటి కోసమే అనేక తంటాలు పడుతున్నామని, 70 వేల కోట్లకి ఏపీ శ్రీలంక అవుతుందంటూ నిన్నటి వరకు ప్రజలను భయపెట్టి, వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసిన బాబు ఇప్పుడు అంతకంటే రెట్టింపు హామీలను ఇస్తున్నారని, బాబు ఇచ్చే హామీల విలువ లెక్క కడితే అక్షరాల ఏడాదికి 1,26 వేల కోట్ల రూపాయలు అవుతుందని జగన్ లెక్కలు చెప్పారు.

మరి అప్పుడు ఏపీ శ్రీలంక కన్నా ఏమవుతుందో బాబు అండ్ కో చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు.

"""/" / చంద్రబాబు హామీలపై ఆయన ఎల్లో మీడియా ఒక విషయం చెబుతోందని, బాబు సంపద సృష్టిస్తారని ప్రచారం చేస్తున్నారని, అయితే బాబు ఇప్పటి దాకా పాలించిన మూడుసార్లు ముఖ్యమంత్రిత్వంలో ప్రతి ఏడాది లోటు బడ్జెట్ తోనే ప్రభుత్వ పాలన సాగిందని జగన్ విమర్శించారు.

ఉమ్మడి ఏపీలో కూడా లోటు బడ్జెట్ తో పాలన చేసిన ఘనత చంద్రబాబుదేనని, చంద్రబాబు ఎన్నికల హామీలు ఇచ్చి, ఎన్నికలైన తరువాత మేనిఫెస్టో( Manifesto )ను బుట్ట దాఖలు చేసే నైజం అని ,చంద్రబాబు ఏమి కొత్త నాయకుడు కాదని, ఆయన మూడుసార్లు ఏపీకి సీఎంగా పనిచేసిన వారేనని, అలాంటి బాబు మళ్లీ ఒక ఛాన్స్ అని ఎలా అడుగుతారని జగన్ ప్రశ్నిస్తున్నారు.

తాను ఏ హామీ ఇచ్చినా నెరవేరుస్తానని, అందుకే ప్రజల్లో విశ్వసనీత ఉందని, తాను ఐదేళ్లలో కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని జగన్ గుర్తు చేస్తున్నారు.

సినిమాల్లో పవర్ స్టారే.. రాజకీయాల్లో కూడా పవర్ స్టారే.. న్యాచురల్ స్టార్ కామెంట్స్ వైరల్!