ఇవాళ మెదక్ లో సీఎం రేవంత్ పర్యటన.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి హాజరు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ మేరకు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు( Medak Congress MP Candidate Neelam Madhu ) నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ క్రమంలో మెదక్ చర్చి గ్రౌండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది.

కాగా నీలం మధు నిర్వహించే నామినేషన్ ర్యాలీ( Nomination Rally )లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

అనంతరం కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ అంతలా నష్టపోయాడా..?