CM Revanth Reddy : ఇవాళ కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
TeluguStop.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్( Kodangal ) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి తన సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్లనున్నారు.
నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
అనంతరం సాయంత్రం కోస్గిలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి కోస్గికి చేరుకుంటారు.
"""/" /
ఈ క్రమంలో ముందుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు, డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) శంకుస్థాపన చేయనున్నారు.
రూ.5 కోట్లతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేయనున్నారు.
తరువాత రూ.25 కోట్లతో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ ( Residential School )భవనంతో పాటు బోమ్మరాస్ పేట్, నీటూరు, దౌల్తాబాద్ జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలకు, చంద్రకల్ లో పశు వైద్య కళశాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు.
వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.అయితే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.