మూసీ యుద్ధం.. రేవంత్ వర్సెస్ ఈటెల
TeluguStop.com
ఎన్నో వివాదాలకు కేంద్ర బంధువుగా మారుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం .ఒకవైపు హైడ్రా, మరోవైపు కొండ సురేఖ వ్యవహారం, ఇంకోవైపు మూసి నది( Musi River ) ప్రక్షాళన వ్యవహారం లో కాంగ్రెస్ అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.
ముఖ్యంగా ఆపరేషన్ మూసి( Operation Musi ) మరో తలనొప్పి మొదలైంది. ఓవైపు రివర్ బెడ్ లో ఇళ్ళ కూల్చివేత, నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది.
ఇంకోవైపు చూస్తే వీటిపై నిరసనలు జరుగుతున్నాయి.పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.
తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్( Etela Rajendar ) బిజెపి నేతలతో కలిసి మూసి పరివాహక ప్రాంతంలో పర్యటించారు.
"""/" /
నవామి గంగ ప్రాజెక్టులో 2500 కిలోమీటర్ల దూరంకి కేంద్రం కేవలం 20 వేల కోట్లు ఖర్చు చేయలేదు.
మూసి ప్రక్షాళనకు లక్షన్నరకోట్లతో ప్రాజెక్టు అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయని రాజేందర్ అన్నారు.
ఈటెల చేసిన ఈ విమర్శలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.
పేదవాళ్ళు ఎప్పుడూ మూసి లోనే ఉండాలా ? మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా అంటూ విపక్షాలపై విమర్శలు చేశారు.
మేము ఎవరిని వదలం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. """/" /
రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.
మూసి ప్రక్షాళన పై విమర్శలు చేయడం కాదు, ఓట్లు వేయించుకున్న బిజెపి ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
బిజెపి ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లేందుకు తనుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని రేవంత్ అన్నారు.
ప్రధాని మోదీ నీ కలవడానికి తాము రెడీ అని, అంతకన్నా ముందు మూసి నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అంటూ సవాల్ విసిరారు రాజేందర్ .
అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శభాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల తప్పకుండా అని రాజేందర్ సవాల్ విసిరారు.
పిఠాపురంలో భారీ ఆస్తులను కొన్న డిప్యూటీ సీఎం పవన్!