CM Revanth Reddy : చేవెళ్ల సభలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

చేవెళ్లలో "జన జాతర"( Jana Jathara ) పేరుతో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ).ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ ( BRS )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు.మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలని కనీస సంస్కారం బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు.

మా ప్రభుత్వం దిగితే కుర్చీ ఎక్కాలని చూస్తున్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులు గురించి కేసీఆర్( KCR ) ఎప్పుడూ ఆలోచించలేదు.

కుమార్తె, కొడుకు, అల్లుడు పదవులు గురించే ఆలోచించారు. """/" / ఈ పార్లమెంట్ ఎన్నికలలో దమ్ముంటే ఒక సీట్ అయినా గెలిచి చూపించండి అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే కనీసం మూడు సీట్లు రావని కేటీఆర్ అన్నారు.

నీకు చేతనైతే దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ అయినా గెలిచి చూపించు.

మేము అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు.కార్యకర్త స్థాయి నుండి ఎవరికి భయపడకుండా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నామని అన్నారు.

ఇదే సమయంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు అందకపోతే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించాలని అన్నారు.

ఎవరైనా అధికారులు మీకు పథకాలు రావని చెబితే వాళ్లను నిలదీయాలని సూచించారు.

చలికాలంలో కాకరకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?