కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ సమీక్ష .. ఆ తొమ్మిది అంశాలు ఏంటి ? 

పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సాధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒకపక్క పార్టీని చేరికలతో బలోపేతం చేస్తూనే,  మరోవైపు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు .

కీలక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ , ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఈరోజు జిల్లా కలెక్టర్లు,  ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు.  సచివాలయంలో నేడు మారథాన్ మీటింగ్ జరగనుంది.

  ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేవంత్ రెడ్డి కలెక్టర్లు , ఎస్పీ లతో సమావేశం కానున్నారు.

"""/" /  కొత్తగా జిల్లాలకు నియమితులైన కలెక్టర్లు ఎస్పీలతో ఆయన తన అభిప్రాయాలను పంచుకోనున్నారు .

ఈ సమావేశంలో కలెక్టర్లు,  ఎస్పీ( Collectors, Sps ) లతో పాటు , ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శి,  కార్యదర్శులు సైతం హాజరుకానున్నారు.

ఈ కీలక సమావేశంలో ప్రధానంగా 9 అంశాలపై తమ ప్రభుత్వ విధానాలను కలెక్టర్లకు ఎస్పీలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

  ప్రభుత్వ పథకాలను కూడా అర్హులైన వారికి అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించనున్నారు.

వ్యవసాయం,  వైద్యం,  ఆరోగ్యం,  మహిళా శక్తి,  వనమహోత్సవం ,  విద్య , శాంతిభద్రతలు , మాదకద్రవ్యాల నిర్మూలన, పాలన వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

"""/" /  జిల్లాల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు , ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు రేవంత్ ఆదేశాలు ఇవ్వనున్నారు.

  దీంతో పాటు భూ వివాదాల నేపథ్యంలో( Land Disputes ),  అనేక జిల్లాల్లో హత్యలు చోటు చేసుకోవడం పైన, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎస్పీలకు సూచనలు చేయనున్నారు.

రౌడీ షీటర్ల విషయంలో రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవద్దని,  వాటిపై కఠిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో శాంతిభద్రతలను అదుపు చేయాల్సిందిగా రేవంత్ ఎస్పీలకు సూచించబోతున్నారట .

ఇంకా అనేక అంశాలకు సంబంధించి కలెక్టర్లు , ఎస్పీ లకు రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?