రేవంత్ తెలివిగా నరుక్కొస్తున్నారే .. ?
TeluguStop.com
మెల్లిమెల్లిగా తన మార్క్ పరిపాలన చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తనపై అన్ని విషయాల్లోనూ నమ్మకం పెట్టుకొని తనకు పూర్తిగా స్వేచ్ఛ అందించిన కాంగ్రెస్ అధిష్టానంతో పాటు, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి తన గౌరవాన్ని కాపాడుకోవాలనే లెక్కలు రేవంత్ ఉన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వారితోపాటు, రాబోయే రోజుల్లో తనకు , పార్టీకి ఇబ్బంది లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నారు .
దీనిలో భాగంగానే ఉద్యమకారుల పై ఫోకస్ పెట్టారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పటికే ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని దీంతోపాటు 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు.
ఉద్యమకారులపై ఉన్న కేసులన్నీ ఎత్తువేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు .ఉద్యమ సమయంలో వారిపై అప్పటి ప్రభుత్వాలు పెట్టిన అన్ని కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు .
ఈ నిర్ణయం వల్ల ఉద్యమకారులంతా తనకు అనుకూలంగా మారతారని రేవంత్ లెక్కలు వేసుకుంటున్నారు.
"""/" /
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) ఉద్యమకారుడే అయినా, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేదని, తమకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తి ఉద్యమకారులలో ఉంది.
అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయడం తో పాటు, కాంగ్రెస్ ప్రకటించిన ఉద్యోగ హామీ , ఇంటి స్థలం వంటి విషయాలను నెరవేర్చి పూర్తిగా వారి మద్దతు తనకు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
"""/" /
దీంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వడం వల్ల వారిని సంతృప్తి పరచని వారి మద్దతు కూడగట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే వీరంతా ఉండేలా రేవంత్ నిర్ణయం తీసుకుంటున్నారు.
తద్వారా తెలంగాణలోని విపక్ష పార్టీలకు( Job Notification ) రాబోయే ఎన్నికల్లో ఏమాత్రం అవకాశం లేకుండా చేసే విధంగా రేవంత్ పావులు కదుపుతున్నారు.
విజయ్ త్రిష మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు.. జస్టిస్ ఫర్ సంగీత అంటూ?