రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!!

ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramoji Rao ) చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నివాళులర్పించారు.

మంగళవారం రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ క్రమంలో రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

జూన్ 8వ తేదీ ఉదయం రామోజీరావు తుది శ్వాస విడిచారు.ఈ క్రమంలో జూన్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Government ) రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం జరిగింది.

ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. """/" / రామోజీ మరణం పట్ల స్పందించి పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని రామోజీరావు నిరూపించినట్లు మీడియాతో వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేసిన వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు.

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కాగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మంగళవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

నాగ చైతన్య తండెల్ సినిమా వల్ల ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది…