₹500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇప్పటికే పలు హామీలు అమలు చేయడం జరిగింది.ఈ క్రమంలో మిగతా హామీల విషయంలో ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దీనిలో భాగంగా గురువారం క్యాబినెట్ సభ కమిటీ భేటీలో సీఎం రేవంత్ కిలక వ్యాఖ్యలు చేశారు.

విషయంలోకి వెళ్తే త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేద్దామని స్పష్టం చేశారు.

"""/" / 500 రూపాయలకే సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

ఇందిరమ్మ ఇళ్ల గ్యారెంటీల( Indiramma House Guarantees ) అమలకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలకు సూచించారు.

అదేవిధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించడం జరిగింది.అసెంబ్లీ సమావేశాలలో మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మరో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడానికి ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయడం రైటేనా.. వ్యతిరేకతకు అసలు కారణాలివే!