CM Revanth Reddy : ప్రభుత్వ విద్యా సంస్థలకు..ఫ్రీ కరెంటు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

పాఠశాలలలో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తామని అన్నారు.దీనిపై కేబినెట్ భేటీలో( Cabinet Meeting ) నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడుతూ.పదేలుగా మీ సమస్యలు చెప్పుకోవటానికి అవకాశం రాలేదు.

ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారు.మీ సమస్యలు విని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.

ఇదే సమావేశంలో శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఉండాల్సిందేనని సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తుంది అని.

"""/" / అన్ని సమస్యలు పరిష్కరించటం జరుగుతుందని హామీ ఇచ్చారు.జీవో 317( GO 317 ) సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థుల ఉద్యోగాలపై ఈ నెల 12వ తేదీన జరిగే క్యాబినెట్ బేటిలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోసారి గవర్నర్ తో మాట్లాడి ప్రొ.కోదండరామ్ ను ( Professor Kodandaram ) ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తాం.

రెగ్యులర్ పోస్టుల్లో రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి ప్రమోషన్స్ కు ఆటంకం లేకుండా చూస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఓఎస్టీలుగా నియమించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..!!