నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్ .. జాబ్ క్యాలెండర్ విడుదల

ఎప్పటి నుంచో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది అని, నిరుద్యోగుల ఉసురు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటోందని, అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అనేక విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయంలో నిరుద్యోగులు బాధలు తీరుస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దీనిపై ముందుకు వెళ్లే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ మేరకు నేడు జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.

  జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత తీసుకొస్తామని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

నిర్దిష్ట కాల వ్యవధిలో నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.ఏఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులను భర్తీ చేయనున్నారనే సమగ్ర వివరాలను జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించనున్నారు.

"""/" / జాబ్ క్యాలెండర్ విడుదలయితే నిరుద్యోగులు దానికి అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంది.

దీంతో నేడు జాబ్ క్యాలెండర్ ( Job Calendar )ను విడుదల చేయనున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారిలో పెరిగిన అసంతృప్తి  బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం.

నిరుద్యోగులు టిఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉండడం , ఆ సమయంలోనే కాంగ్రెస్ నిరుద్యోగులకు మద్దతుగా అనేక పోరాటాలు చేయడం వంటివి చోటు చేసుకున్నాయి.

"""/" / ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా నిరుద్యోగుల మద్దతు తమకు ఉంటుందని,  రాబోయే రోజుల్లో ఇది తమకు బాగా కలిసి వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అందిన వేస్తోంది.

దీనిలో భాగంగానే  ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రజల్లో మరింత బలం పెంచుకునే దిశగా రేవంత్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

బిజెపి , భీఆర్ఎస్( BJP, BRS ) లకు ధీటుగా తెలంగాణా లో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆరో తరగతిలో 5 లక్షల ఫండ్.. ఆ ఘటనతో ఐఏఎస్… అశోక్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!