ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గత ప్రభుత్వంలో కొన్ని ఉన్నతాధికారుల నియామకాలను రద్దు చేయడం జరిగింది.
ఇక గత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల విషయంలో కూడా విచారణ దిశగా అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసే విధంగా రేవంత్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) తీసుకొచ్చిన ధరణిపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
విషయంలోకి వెళ్తే ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కన్వీనర్ గా CCLA సభ్యుడు సభ్యులుగా ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ లను నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది.
ఈ కమిటీ ధరణి పోర్టల్( Dharani Portal ) అంశాలను అధ్యయనం చేసి వెబ్ సైట్ పునరుద్ధరించడానికి సిఫార్సులు చేయనుంది.
కొత్త సమస్యలు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది.భూ రికార్డుల ప్రక్షాళనలో సమస్య వచ్చినట్లు తమ విస్తీర్ణం తగ్గింది అంటూ లక్షల మంది గగ్గోలు పెట్టడం జరిగింది.
భూమి ఉన్న వాళ్లకు రికార్డుల్లో లేదు.రికార్డులలో ఉన్న వాళ్లకు భూమి లేదు.
దీంతో అలాంటి తప్పిదాలకు తావు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.