ఆ ఎన్నికలపై కంగారు.. అధికారులకు ఆదేశాలు జారీ
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలోని గ్రామపంచాయతీలకు ఎన్నికలను( Gram Panchayat Elections ) వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కంగారు పడుతున్నారు.
తెలంగాణ లో గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసి 6 నెలలు కావడంతో, ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.
సెక్రెటరియేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు తో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా వీలైనంత తొందరగా పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలను నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
"""/" /
ఈ మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు సంభందించి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.
వచ్చే నెల ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రతి జిల్లా నుంచి ఐదుగురికి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇప్పించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని 23 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Santhi Kumari ) ఆదేశాలు జారీ చేశారు.
వాస్తవంగా ఈ ఏడాది జనవరిలో గ్రామపంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసింది.పార్లమెంట్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించింది.
"""/" /
ప్రస్తుతం గ్రామాల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది దీంతో వీలైనంత తొందరగా ఎన్నికలను నిర్వహించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బాగా బలహీనం కావడం , ఆ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడం, తదితర పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ బాగా బలహీన పడడండంతో ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయం అని, బీఆర్ఎస్ బలపడే లోపు ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణలో మెజారిటీ పంచాయతీ లు కాంగ్రెస్ పరం పడతాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!