తాగుబోతు… సన్నాసి ! కేటీఆర్ కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్
TeluguStop.com
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్,( KCR ) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు .
సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి( Rajiv Gandhi Statue ) సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఆ తరువాత నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు.రాజీవ్ గాంధీ విగ్రహం విషయమై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
'' ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి. రాజీవ్ విగ్రహాన్ని మూడితే చెప్పు తెగేదాకా కొడతాం .
రాజీవ్ విగ్రహం ఎవరు ముడతారో , ఎప్పుడు మూడుతారో చెబితే మా జగ్గారెడ్డిని పంపిస్తాం.
తాగుబోతులు , దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం.
"""/" /
పండుగ వాతావరణం లో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం.రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్మాసులు అంటున్నారు.
అధికారం పోయినా బలుపు తగ్గలేదు. బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు.
వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు.వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు విగ్రహాన్ని పెట్టేటప్పుడు ? ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు.
తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటరియేట్ ముందు పెడతారా ? తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'' పొద్దున్న లేస్తే తాగేవాడి విగ్రహాన్ని సెక్రటరీ ముందు పెడతారా ? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా ? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు బేటా మీకు అధికారం ఇక కలనే.
"""/" /
ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం( Telangana Thalli Statue ) పెట్టని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు .
డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది .
మా చిత్త శుద్దిని ఏ సన్నాసి సెంకించాల్సిన అవసరం లేదు.విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది.
కలలో కూడా నీకు అధికారం రాదు.10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం మీకు గుర్తుకు రాలేదా ? టిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తాం.
డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం ''; అంటూ రేవంత్ మాట్లాడారు.
మెగా హీరోలకు పోటీగా నందమూరి హీరోలు… లెక్క పెరుగుతుందిగా!