సహచర మంత్రులకు అభినందనలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ మూడో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రులుగా నియమితులైన.తన తోటి సహచర మిత్రులకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

"తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులైన నా సహచర మిత్రులకు అభినందనలు.సమిష్టి కృషితో అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంకితమవుదాం.

అన్నీ రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపుదాం".అని ట్వీట్ చేశారు.

"""/" / రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka )డిప్యూటీ సీఎంగా రెవెన్యూ శాఖ, హోం మంత్రిగా ఉత్తంకుమార్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ, పురపాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!