కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ తో సీఎం రేవంత్ భేటీ..!

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో త్వరితగతిన సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరనున్నారు.

తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

తెలంగాణ రావాల్సిన నిధులపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రద్దు అయింది.

గోయల్ కు అత్యవసర సమావేశం ఉండటంతో రేవంత్ రెడ్డి భేటీని రద్దు చేశారు.

కాగా ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.