నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com
రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల వివరాలను గ్రామాలు, మండలాల స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.
శనివారం నీటిపారుదల శాఖపై( Irrigation Department ) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సమయంలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్నారు.ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు( Palamuru-Rangareddy Project ) ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
"""/" /
కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు.
మొదటి ప్రాధాన్యతగా ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.ఏదిఏమైన టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.
ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు( SLBC PROJECT ) పూర్తయితే 4లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వివరించారు.
ఈ క్రమంలో గ్రీన్ ఛానల్ ద్వారా కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
శనివారం నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో పలు ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఈ ఫేస్ ఆయిల్ తో సూపర్ గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ మీ సొంతం!