20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశా.. సీఎం రేవంత్

కోరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని తెలిపారు.

రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ( BJP ) కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలోనే బీజేపీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర పన్నుతోందన్నారు.

అయితే బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు తాను బహిరంగంగా ప్రశ్నించానన్న సీఎం రేవంత్ రెడ్డి అందుకే తనపై పగతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కేసు పెట్టిందని ఆరోపణలు చేశారు.

కానీ తాను కేసులకు భయపడేవాడిని కాదని చెప్పారు.20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను చూశానన్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్( KCR ) తనను జైల్లో బంధిస్తే భయపడ్డానా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఇదే తరహాలో భయపెట్టాలని చూస్తే ప్రజలే బుద్ది చెప్పారని పేర్కొన్నారు.ఈడీ, ఐటీ మరియు సీబీఐ వంటి సంస్థలతో బీజేపీ ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు.

బీజేపీ దగ్గర ఈ సంస్థలు ఉంటే తన వద్ద ప్రజలు ఉన్నారని తెలిపారు.

మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…