సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు..!!

తెలంగాణ రాష్ట్రంలో భారీ మరియు అతి భారీ వర్షాలు( Telangana Heavy Rains ) కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు రెండు రోజులు ప్రభుత్వం ప్రకటించింది.

ఆల్రెడీ గత వారంలో కురిసిన వర్షాలకు అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాలకు బుధవారం అదేవిధంగా గురువారం రాష్ట్రంలో అన్ని రకాల విద్యాసంస్థలకు మళ్ళీ సెలవులు( School Holidays ) ప్రకటించటం జరిగింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

"""/"/ దీంతో తెలంగాణలో అనీ విద్యాసంస్థలకూ  26, 27 తేదీలలో సెలవు దినాలుగా ప్రకటించడం జరిగింది.

గతవారం భారీ వర్షాలు కురిసిన క్రమంలో గురువారం నుండి శనివారం వరకు మూడు రోజులపాటు సెలవులు ఇవ్వగా తర్వాత వర్షాలు తగ్గడంతో సోమవారం నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

కానీ అనుభవంగా మళ్ళీ ఒక్కసారిగా వర్షాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ( Weather Department ) హెచ్చరించడంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే కురుస్తున్న భారీ వర్షాలకు చాలా పాఠశాలలలో నీళ్లు చేరుకోవడంతోపాటు పైకప్పుల నుంచి వర్షపు నీళ్ళు జారబడి తరగతి గదులు తడిసి ముద్దయ్యాయి.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) సెలవులు ప్రకటించటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్‌ ఆడిన సీఎం.. వీడియో వైరల్