పంట నష్టంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
రెండు లక్షల 28 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎక్కువగా వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోందని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3 లక్షల 25 వేలని తెలిపారు.
రైతులు ఏ మాత్రం నిరాశ చెందవద్దని సూచించారు.పంట నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెల్లడించారు.
వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం కానీయమన్నారు.కౌలు రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎకరాకు రూ.
10 వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.