ఈ నెల 20న సూర్యాపేటకు సీఎం కేసీఆర్…!

సూర్యాపేట జిల్లా: ఈనెల 19,20 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

ముందుగా 19 మెదక్ జిల్లా పర్యటన ముగించుకొని,20న సూర్యాపేట జిల్లా పర్యటనకు వస్తున్నట్లు సమాచారం.

సూర్యాపేట జిల్లా పర్యటనలో 20వ తేదీ ఆదివారం నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా( Suryapet District ) కలెక్టర్ కార్యాలయాన్ని,అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

/BR అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ( Medical College ) ప్రారంభంకానుంది.

అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!