వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ -కేసీఆర్
TeluguStop.com
రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ నిరంతరం కృషి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
బుధవారం ప్రగతి భవన్లో వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలవుతున్న తీరు గురించి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
సాంప్రదాయక సాగు పద్దతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలని చెప్పారు.వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ మారాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఒక్కో విభాగానికి ఒక్కో అదనపు సంచాలకుడిని నియమించాలని ఆధికారులను ఆదేశించారు.రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు.
రైతు వేదికలు రైతులు చైతన్యానికి వేదికలుగా మారతాయని ఆకాంక్షించారు.అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేసి, పొరుగు రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను ఆధ్యయనం చేసి రావాలని సూచించారు.
కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, రైతులకు ఉచితంగా సాగు నీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మరోవైపు ఖైదీలకు సంబంధించిన మార్గదర్శాకాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు.ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు.
దీని కోసం జాబితా రూపొందించాలని పేర్కొన్నారు.
క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!