ఢిల్లీ పర్యటనకు రెడీ అయిన సీఎం కేసీఆర్...!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు.
సెప్టెంబర్ ఒకటవ తారీకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్లనున్నారు.
సెప్టెంబర్ రెండో తారీకు ఢిల్లీలో తెలంగాణ భవన నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఢిల్లీ లోని వసంత విహార్ మెట్రో స్టేషన్ పక్కన 13 వందల గజాల స్థలాన్ని గతంలో తెలంగాణ భవనానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించడాం జరిగింది.
"""/" /
ఈ నేపథ్యంలో భూమి పూజ చేయటానికి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ మంత్రులు ప్రజా ప్రతినిధులు రెడీ అవుతున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం సెప్టెంబర్ 3వ తారీకు తిరిగి సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాదు కి చేరుకున్నారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నట్లు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.
ఎల్లుండే సెప్టెంబర్ మొదటి తారీకు కావడంతో ఇప్పటి నుండే ప్రభుత్వ అధికారులు కేసీఆర్ ఢిల్లీ పర్యటన కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు భూమి పూజ కోసం.అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నారు.
అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?