సీఎం కెసిఆర్ మునుగోడు ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని హామీ

ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం.అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.

ఇల్లు కాలిపోత‌ది.చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.

మంచి, చెడు ఆలోచించి వేయాలి.బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి.

తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది.ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా మునుగోడులో పర్యటించానని, ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా పోరాటం చేశానని సీఎం కేసీఆర్ చెప్పారు.

అందులో భాగంగా 'సూడు సూడు నల్లాగొండ.గుండె మీద ఫ్లోరైడ్ బండ, ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్న నల్లగొండకు నరకం చూపిన రాజకీయ గండాలెన్నో.

' అనే ఎన్నో పాటలు రాశానని చెప్పారు.మునుగోడులో TRSను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

ఛీ, స్కూల్ పిల్లలతో పాడు పని చేయిస్తోంది.. ఆంధ్ర టీచరమ్మ వీడియో చూశారా?