కోవిడ్‌ పై పీఎం మోడీ సీఎం కేసీఆర్‌ చర్చించిన విషయాలు ఇవే

దేశంలో కరోనా కేసుల సంఖ్య పాతిక లక్షలకు చేరువ అవ్వబోతుంది.కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతుంది.

ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పలువురు ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా మాట్లాడటం జరిగింది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు సీఎస్‌లతో కూడా ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు విషయాలను ప్రధాని మోడీకి వివరించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడంతో పాటు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన తీరు గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఉన్న వైధ్యుల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు ఆసుపత్రులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారట.

గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్‌ ఇబ్బంది పెడుతుంది.భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ మళ్లీ వస్తాయనే ముందు చూపుతో జాగ్రత్తగా ఉండటం మంచిదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని తప్పకుండా అతి త్వరలోనే పూర్తిగా అదుపు చేస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.

టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు మృతుల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని ప్రధానికి సీఎం కేసీఆర్‌ తెలియజేశారు.

తెలంగాణలో వైధ్య కాలేజ్‌లు పెంచడంతో పాటు డాక్టర్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని మోడీకి సీఎం సూచించారు.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?