ఆ బిల్లు తేనె పూసిన కత్తి అని చెబుతున్న కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ ముక్కుసూటితనం గురించి మనందరికీ తెలిసిందే.ఏ విషయం గురించైనా తన మనస్సులోని అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కేసీఆర్ చెబుతూ ఉంటారు.

తాజాగా కేసీఆర్ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు గురించి స్పందించారు.ఆ బిల్లు గురించి కేసీఆర్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయవద్దని ఎంపీలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు.

రైతులకు ఈ బిల్లువల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.తేనె పూసిన కత్తి నూతన వ్యవసాయ బిల్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం తెలపకూడదని కేసీఆర్ అన్నారు.కార్పొరేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఉన్న ఈ బిల్లు వల్ల రైతాంగానికి తీవ్ర నష్టమని పేర్కొన్నారు.

రైతు లోకానికి తీవ్రంగా నష్టం చేకూర్చేలా బిల్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎక్కడైనా రైతులు సరుకును అమ్ముకునే విధంగా నూతన వ్యవసాయ బిల్లులో నిబంధనలు ఉన్నాయని.

అయితే ఈ నిబంధన వల్ల కార్పొరేట్ వ్యాపారులకే తప్ప రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని చెప్పారు.

ఈ విధానం ద్వారా కార్పొరేట్ గద్దలు దేశం అంతటా విస్తరిస్తాయని పేర్కొన్నారు.రైతులు తమ దగ్గర ఉండే కొంత సరుకును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమవుతుందా.

? అని ప్రశ్నించారు.ఇలాంటి తేనె పూసిన కత్తిలాంటి చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని తెలిపారు.

మక్కల దిగుమతిపై 50 శాతం సుంకాన్ని కేంద్రం 15 శాతానికి తగ్గించిదని.ఈ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో సులభంగానే అర్థమవుతుందని పేర్కొన్నారు.

కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి తరుణంలో వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కేసీఆర్ అన్నారు.

సమ్మర్ హీట్ ను బీట్ చేసే బెస్ట్ జ్యూస్ ఇది.. తప్పక డైట్ లో చేర్చుకోండి!