జస్ట్ ఫర్ ఛేంజ్.. కేసిఆర్ న్యూ స్ట్రాటజీ !
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.ప్రధాన పార్టీలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని బిఆర్‌ఎస్ భావిస్తుంటే.ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది.
ప్రధాన పోరు కూడా ఈ రెండు పార్టీల మద్యనే ఉండే అవకాశం ఉంది.
దాంతో ఇప్పటినుంచే అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు.ముఖ్యంగా బిఆర్‌ఎస్ పార్టీకి ఈ సారి ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి.
ఎందుకంటే వరుసగా రెండు సార్లు విజయం సాధించడంతో మూడవసారి ప్రజాఆలోచన మారే అవకాశం లేకపోలేదు.
"""/" /
మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీజేపీ కూడా బలం పెంచుకుంటూ ఉండడంతో ప్రత్యర్థిపార్టీలు ఇచ్చే పోటీని బిఆర్‌ఎస్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే సరైన టైమ్ లో సరైన నిర్ణయాలు తీసుకొని వ్యూహారు రచించడంలో కేసిఆర్ తరువాతే ఎవరైనా.
ఆయన వేసే ఎత్తులను ప్రత్యర్థులు అంచనా వేయడం కాస్త కష్టమైన పనే.గత ఎన్నికల సమయంలో ఎవరు ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విజయకేతనం ఎగురవేశారు.
అదే విధంగా ఈసారి కూడా కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెలతారని ప్రతిపక్ష పార్టీ నేతలు తరచూ చెబుతున్నప్పటికి.
అలాంటిదేమీ లేదని బిఆర్‌ఎస్ కొట్టిపారేస్తుంది. """/" /
మరోవైపు ఈసారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నందున కేసిఆర్ న్యూ స్ట్రాటజీకి తెరతీస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండు సార్లు అధికారం చేపట్టడంతో మూడవసారి సహజంగానే కొంత వ్యతిరేకత వినిపించే అవకాశం ఉంది.
దాంతో ఆ వ్యతిరేకతను అధిగమించేందుకు.ఇన్ యాక్టివ్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట.
దాదాపుగా 25 సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసిఆర్ మార్చే ఆలోచనలో ఉన్నారట.దాంతో ఎవరికి సీటు దక్కుతుంది ఎవరికి దక్కదు అనే ఆందోళనలో ఎమ్మేల్యేలు ఉన్నారట.
కేవలం ఎమ్మెల్యేల మార్పే కాకుండా పార్టీలో కూడా సంస్థాగత మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కేసిఆర్ కేవలం తెలంగాణ వరకే కాకుండా జాతీయ రాజకీయాలపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలో కేసిఆర్ ఎలాంటి కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగానే మారింది.
క్రేజీ.. సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి తలుపుపై ఏమి రాసి వెళ్లారంటే?