గులాబీ బాసూ నెంబ‌ర్ 6 టు 3... ఈ లొల్లేంది సారూ...?

అప‌ర భ‌రీగ‌ర‌ధుడు, రాజ‌కీయ అప‌ర చాణ‌క్యుడు, గులాబా బాస్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌ని లేదు.

ఆయ‌న తీరు, మాట‌, వ్య‌వ‌హార శైలి, న‌డ‌వ‌డిక అన్నీ స‌ప‌రేటుగా ఉంటాయి.చేసే ప‌నులు సైతం విభిన్నంగా ఉంటాయి.

అలాగే అంకెల‌తోనూ కేసీఆర్‌కు అవినాభావ సంబంధ‌మే ఉంది.6 అంకె అన‌గానే సీఎం కేసీఆర్‌గా గుర్తుప‌డుతుంటారు.

ఎందుకంటే కేసీఆర్‌కు 6 వ్య‌క్తిగ‌తంగా క‌లిసొచ్చే అంశంగా చెబుతారు.అందుకే ఏదైనా ముఖ్య‌మైన ప‌ని ప్రారంభించాల‌నుకుంటే ఈ 6నెంబ‌ర్ ఉండేలా చూసుకుంటుంటాడు.

కానీ, ఇటీవ‌ల కేసీఆర్ విష‌యంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే ఆయ‌న అంకె మారిపోయింద‌నేలా క‌నిపిస్తోంది.

దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.ఇటీవ‌ల సీఎం కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా జ‌ర‌పిన విష‌యం విధిత‌మే.

అయితే ముందుగా ఈ కార్యక్ర‌మాల‌ను ఘ‌నంగా చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించింది.ఆ మేర‌కు రాష్ట్రమంత్రి కేటీఆర్ సైతం కేసీఆర్ బ‌ర్త్‌డేను భారీగా నిర్వ‌హించాల‌ని గులాబీ దండు సూచించారు.

ఇందుకు త‌గ్గ‌ట్టే గులాబీ నేత‌లు రంగంలోకి దిగి సీఎం కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఒక రేంజ్‌లో నిర్వ‌హించారు.

ఇదంతా మ‌న‌కు తెలిసిన విష‌య‌మే.ఆ వేడుక‌లు కేటీఆర్‌కూడా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌డం విశేషం.

"""/"/ అయితే మంగ‌ళ‌వారం (మార్చి-8)న మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు.వీటిని ఒక రోజు కాకుండా మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని గులాబీ దండు నిర్ణ‌యించుకుంది.

అనుకున్న‌దే త‌డువుగా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తూ త‌మ స‌త్తా చాటుతున్నారు.అయితే మొన్న‌టి వ‌ర‌కు నెంబ‌ర్ 6కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇటీవ‌ల నెంబ‌ర్ 3కు మారాడా ? అన్న సందేహం వ్య‌క్తమ‌వుతోంది.

అలాగే బీజీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా కేసీఆర్ మూడో కూట‌మిని జాతీయ స్తాయిలో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న విష‌యం విధిత‌మే.

ఇలా నెంబ‌ర్ 3ను గులాబీ బాస్ తెర‌మీద‌కు తీసుకురావ‌డం అంద‌రి మ‌దిని తొలిచి వేస్తోంది.

మ‌రి ఆ నెంబ‌ర్ 3 కొన‌సాగుతుందా ? లేదా ? అన్న‌ది వేచి చూడాల్సిందే.

డాకు మహారాజ్ గా బాలయ్య… చరణ్ కు పోటీగా రాబోతున్న బాలకృష్ణ?