సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండు:కేంద్ర మంత్రి మహేంద్రనాధ్ పాండే

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలోని సమస్త ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు రాష్ట్ర సాధన ఉద్యమబాట పట్టి, రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి,వందలామంది యువత బలిదానాల ఫలితంగా ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ( CM KCR )కుటుంబ పాలన సాగిస్తూ ఇక్కడి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి మోసం చేస్తున్నాడని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే( Mahendranath Pandey ) అన్నారు.

సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని విగ్నేశ్వర ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ ప్రవాస్ యోజన కీ ఓటర్స్ మీటింగ్కు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రం వస్తే నీళ్లు,నిధులు, నియామకాల్లో న్యాయమైన వాటా దక్కుతుందని చెప్పిన సీఎం కేసీఆర్,తన పాలనలో నిరుద్యోగుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సీఎం కేసీఆర్ వందల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు.నక్కలగండి ప్రాజెక్ట్ పనులు 10 శాతం కంప్లీట్ కాలేదన్నారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు.మెట్రో ప్రాజెక్ట్కు రూ.

11 వేల కోట్లతో పాటు దేశ వ్యాప్తంగా 175 గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల నిర్మాణం చేపట్టేందుకు రూ.

5,5కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.రాష్ట్రంలో సాగిస్తున్న దోపిడి,అరాచక పాలనను గద్ధె దింపి,ప్రజా సంక్షేమ పాలన చేస్తున్న బీజేపీని గెలిపించాలని కోరారు.

తెలంగాణలో బీజేపీ క్యాడర్ ఎంతో ఉత్సాహంగా పని చేస్తోందని,రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ముందుగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో స్థానిక మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో అయన మీటింగ్ నిర్వహించారు.

ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అప్పగిస్తున్న వడ్లను రా రైస్ గా మారిస్తే నూక శాతం అధికంగా ఉండి మిల్లర్లకు నష్టవస్తోందని,రా రైస్ కు బదులుగా బాయిల్డ్ బియ్యం స్వీకరించాలని, అదే విధంగా బియ్యం బై ప్రొడక్ట్(తవుడు) పై టాక్స్ తొలగింపుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఇక్కడి ఎఫ్.సి.

ఐ.కే బియ్యం పంపిస్తున్నారని దీంతో ఎఫ్.

సి.ఐ గోదాం నిండిపోయి ఇబ్బందులు పడుతున్నమని,ర్యాక్ల సంఖ్య పెంచాలని కోరారు.

రైతు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కర్నాటి రమేష్,బండారు కుశలయ్య,గౌరు శ్రీనివాస్, భోగవెల్లి వెంకటరమణ చౌదరీ మంత్రిని కోరారు.

ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన మంత్రి రైస్ మిల్లర్లు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కంకణాల శ్రీధర్రెడ్డి,సాధినేని శ్రీనివాసరావు,ధర్మారావు, బండారు ప్రసాద్,రతన్ సింగ్ నాయక్‌,లచ్చిరెడ్డి, బంటు సైదులు, సీతారాంరెడ్డి, పురుషోత్తంరెడ్డి,కొండేటి సరిత,కవిత,ఎడ్ల రమేష్, రామకృష్ణ,సత్యప్రసాద్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ తో తెరమరుగు అయినా టాలీవుడ్ సెలెబ్స్ వీరే !