ముందస్తు ఎన్నికలా నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ రివర్స్ గేర్ !

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి.ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనుండడంతో అన్నీ ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారిస్తున్నాయి.

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికే రెండు సార్లు విజయం సఃదించి పాలిస్తున్న బి‌ఆర్‌ఎస్ ముచ్చటగా మూడవసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.

ఈసారి బి‌ఆర్‌ఎస్ దూకుడుకి చెక్ పెట్టి ఎలాగైనా వచ్చే ఎన్నికలతో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

మరోవైపు బి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ ఇచ్చి తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఇలా మూడు పార్టీలు కూడా అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి.ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది.

కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, అందుకు తాము సిద్దంగా ఉన్నామని కమలనాథులు పదే పదే చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పలుకుతున్నారు.అయితే తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ ఇదివరకే స్పష్టం చేశారు.

అయినప్పటికి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ ఆగడంలేదు.అయితే ఇటీవల బి‌ఆర్‌ఎస్ నేతలను లిక్కర్ స్కామ్ వెండతుడుతున్న సంగతి తెలిసిందే.

ఈ స్కామ్ లో సి‌ఎం కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితాకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా అందాయి.

"""/" / మొదటిసారి విచారణ కూడా జరిగింది.ఇక తాజాగా ఈనెల 11న మరోసారి కవితను ఈడీ విచారించనుంది.

దాంతో లిక్కర్ స్కామ్ లో కవితా అరెస్ట్ అవ్వడం ఖాయమని తెలంగాణ బీజేపీ చెబుతున్నారు.

పరిస్థితులు కూడా కవితా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కవిత విచారణకు ముందు రోజు సి‌ఎం కే‌సి‌ఆర్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఎన్నో ప్రశ్నలకు ఉతమిచ్చింది.

ఎందుకంటే ఎమర్జెన్సీ సమయాల్లో తప్పా మిగిలిన సమయాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించడం చాలా అరుదు.

కానీ కే‌సి‌ఆర్ తాజాగా మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి.

"""/" / తాజాగా మంత్రివర్గ సమావేశంలో కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

నేతలంతా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ సమావేశాలు నిర్వహించాలని, పాదయాత్రలు చేపట్టాలని ఆయన సూచించారు.

ఈసారి ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ దే విజయం అని కే‌సి‌ఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా కే‌సి‌ఆర్ తీసుకునే నిర్ణయాలు, వ్యూహాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి.మరి ముందస్తు ఎన్నికల విషయంలో కూడా కే‌సి‌ఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్న ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.

Validation Check 2026-03-24 10:38:07