ఆ అభ్యర్థిపై సీఎం ఫోకస్.. హుజూరాబాద్ టికెట్ ఖాయమేనా?
TeluguStop.com
తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.నోటిఫికేషన్ కూడా రాకముందే టీఆర్ ఎస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది.
ఎందుకంటే ఈటల రాజేందర్ లాంటి బలమైన నేతపై గెలవాలంటే అన్ని ఆయుధాలను వాడాల్సిందే.
కాకపోతే ఇప్పటి వరకు టీఆర్ ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం తెగ కష్టపడుతున్నారు.ఊర్లన్నీ చుట్టేస్తూ అభివృద్ధి పనులు దగ్గరుండి చేయిస్తున్నారు.
ఇక టీఆర్ ఎస్ నుంచి పోటీ చేయడానికి చాలా మంది పోడుతున్నారు.కాకపోతే ఈటలకు ఢీకొట్టే వ్యక్తి కోసం కేసీఆర్ ఆరా తీస్తున్నారు.
ఇందుకోసం చాలా మందిపై కేసీఆర్ పలు సర్వేలు కూడా చేయిస్తూ ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే ఒక నలుగురు అభ్యర్థులపై సర్వే చేయించిన కేసీఆర్ వారిపై పార్టీ శ్రేణుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.
అయితే వీరందరిలో ఒక అభ్యర్థిపై మాత్రం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.ఆయనెవరో కాదు ప్రస్తుతం వేములవాడ రాజరాజేవ్వర ఆలయ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా పని చేస్తున్న ముద్దసాని పురుషోత్తం రెడ్డి.
ఈ పురుషోత్తం రెడ్డి కమలాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దామోదర్‌రెడ్డికి స్వయానా అన్ననే.
"""/"/ దామోదర రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ఆయనపై ప్రజల్లో ఉన్న సింపతీ కలిసి వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
పురుషోత్తం రెడ్డి ఇప్పటికే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
పైగా కేసీఆర్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి.దీంతో త్వరలోనే ఆయన్ను టీఆర్ ఎస్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ఈయన తమ్ముడు దామోదర్ రెడ్డి కశ్యప్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ.ఈయన్నే ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరి గులాబీ బాస్ ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
వైరల్ వీడియో: పబ్లిక్ లో షర్ట్ జోబిలో ఉన్న ఫోన్ ను ఎలా కొట్టేస్తారో చూసారా?