కే‌సి‌ఆర్ కు కోవర్ట్ ల భయం !

నిన్న మొన్నటి వరకు కోవర్ట్ రాజకీయాలు( Covert Politics ) అనగానే టి కాంగ్రెస్ గుర్తొచ్చేది.

ఎందుకంటే ఆ పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని వారితో కాంగ్రెస్ కు ముప్పు ఉందని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతూ వచ్చారు.

కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS Party ) కోసం పని చేస్తున్నారని గట్టిగానే విమర్శలు వచ్చాయి.

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.అదే కోవర్ట్ ల భయం ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ ను వెంటాడుతోంది.

ఎన్నికలు దగ్గర పడడంతో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పోలిటికల్ హిట్ పెంచారు ఆ పార్టీ అధినేత కే‌సి‌ఆర్.

"""/" / అయితే మెజారిటీ సీట్లను సిట్టింగ్ లకే కేటాయించడంతో కొత్తగా సీట్లు ఆశించిన ఆశావాహులు తీవ్రంగా భంగపాటుకు గురయ్యారు.

ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ లో అసంతృప్త నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి.సీటు దక్కని చాలమంది నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు.

ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ లోని అసంతృప్త నేతలను ఆకర్షించడంలో హస్తంపార్టీ బాగానే సక్సస్ అవుతోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ వంటి వారితో పాటు త్వరలో కాంగ్రెస్ లో చేరబోయే తుమ్మల.

ఇలా వరుసగా బి‌ఆర్‌ఎస్ అసంతృప్త నేతలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తూ సక్సస్ అవుతోంది.

"""/" / ఈ విధంగా పార్టీ లోని సీనియర్ నేతలంతా వరుసగా చేజారిపోతుండడంతో పార్టీలో కోవర్ట్ లు ఉన్నారా అనే భయం కే‌సి‌ఆర్ ను వెంటాడుతోందట.

ఎందుకంటే సీటు దక్కని నేతలు రెబెల్స్ గా మారుతూ పార్టీకి తలనొప్పులు తెస్తున్నారు.

దీంతో వీరిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు ఇతర పదవుల ఆశచూపుతున్నారు కే‌సి‌ఆర్( CM KCR ).

తుమ్మల( Tummala Nageswara Rao ), మైనంపల్లి, రాజయ్య ఇలా సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు.

దీంతో సొంత నేతల వల్లే పార్టీకి భారీగా నష్టం చేకూరుతుందేమో అని గులాబీ బాస్ ఆందోళనకు గురౌతున్నారట.

మరి ఈ కోవర్ట్ రాజకీయాలు ఎటొచ్చీ బి‌ఆర్‌ఎస్ నే అలుముకోవడంతో ప్రస్తుతం పార్టీని క్రమబద్దీకరించడం కే‌సి‌ఆర్ కు సవాల్ గా మారింది.

మరి ముందు రోజుల్లో కే‌సి‌ఆర్ తన పార్టీ రెబెల్ నేతలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.

అచ్చం.. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో లాగే.. మొబైల్ ద్వారా డెలివరీ చేయించిన డాక్టర్..