కలెక్టర్లకు కియా.. పేదల పై లేదా గులాభి బాసుకు దయ.. !!

కలెక్టర్లకు కియా పేదల పై లేదా గులాభి బాసుకు దయ !!

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.తెలంగాణ జిల్లా అదనపు కలెక్టర్లకు అధికారిక వాహనాలుగా కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేయడం పలు విమర్శలకు తావిస్తుంది.

కలెక్టర్లకు కియా పేదల పై లేదా గులాభి బాసుకు దయ !!

ఇప్పటికే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 40 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, లోటు బడ్జెట్ రాష్ట్రంగా తయారు చేసిన సీఎం తాను పట్టిన కుందేలుకు కూడు కాళ్లు అనేలా నియంతలా పాలిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న ఐడోంట్ కేర్ అంటూ 32 అల్ట్రా లగ్జరీ వాహనాలు కొనడానికి 11 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఎంతవరకు సమర్థనీయం అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కలెక్టర్లకు కియా పేదల పై లేదా గులాభి బాసుకు దయ !!

ఇక ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదనే విమర్శలుండగా, హాస్పిటల్స్ లో వెంటిలేటర్లు కొనడానికి నిధులు లేవు, డాక్టర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల సొమ్ముతో రాజభోగం అనుభవిస్తున్న తెరాస ప్రభుత్వ దుభారా ఖర్చులు అది కోవిడ్ సమయంలో సిగ్గుచేటని ప్రజలు కూడా విమర్శిస్తున్నారట.

సరైన జీతాలు లేక, పెరుగుతున్న ధరలు మెడకు ఉరితాడులా బిగుసుకుంటున్న పేద ప్రజల పట్ల కనీస దయ చూపకుండా గులాభి బాసు ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే తన రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని అనుకుంటున్నారట మేధావులు.

ఇక ప్రాణాలు త్యాగాలు చేసి కుటుంబాన్ని పోషించుకునే స్దితిలో కూడా లేని అమరవీరుల బలిదానాలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బజారున నిలబెట్టడానికా అని అమరులైన కుటుంబాలు వేదన చెందుతున్నారట.

చిక్కుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. నోటీసులు జారీ చేసిన ఈడీ

చిక్కుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. నోటీసులు జారీ చేసిన ఈడీ