ఎట్ హోం కార్య‌క్రమానికి సీఎం కేసీఆర్ దూరం..

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజ్ భ‌వ‌న్ లో ‘ఎట్ హోమ్’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

అయితే ఈ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.అయితే కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌ని రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాల‌కు సీఎంవో స‌మాచారం పంపింది.

సీఎం గైర్హాజ‌రు కావ‌డంతో టీఆర్ఎస్ నేత‌లు, ఇత‌ర ప్ర‌తినిధులు వెళ్ల‌లేదు.సీఎస్ సోమేశ్ కుమార్, హైద‌రాబాద్ సీపీ ఆనంద్, రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర కార‌ణంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ తేనేటి విందుకు హాజ‌రు కాలేక‌పోతున్నట్లు తెలిపారు.