రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.జగన్ ప్రారంభించనున్న బస్టాండ్, వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించారు.

చిన్న చిన్న పెండింగ్ పనులు ఉంటే రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా చినమామిడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్ ను, 25 వార్డు వీవర్స్ కాలనీ వద్ద సీఎం బహిరంగ సభ వేదికను పరిశీలించారు.

ఈ క్రమంలో వేదిక పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

మ్యాడ్ స్క్కేర్ పై అంచనాలు పెంచేసిన స్వాతిరెడ్డి సాంగ్.. మరో భారీ హిట్ పక్కా అంటూ?