రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆయన వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

విజయనగరంతో పాటు రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

పర్యటనలో భాగంగా ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణతో పాటు నూతన మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు.

తరువాత ల్యాబ్ ల పరిశీలన అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు.కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности