శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పత్రాల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు.

కాగా తాడేపల్లి నుంచి బయలు దేరిన సీఎం జగన్ నరసన్నపేటకు చేరుకున్నారు.గత ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేసిన భూముల రీసర్వేను సీఎం జగన్ ప్రభుత్వం సాకారం చేసిన సంగతి తెలిసిందే.

సమగ్ర భూముల రీసర్వేను ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి తొలి దశలో రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసింది.

ఈ క్రమంలో ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?