CM YS Jagan : కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా( YSR Kadapa ) లో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా పులివెందులకు వెళ్లనున్న సీఎం జగన్( AP CM YS Jagan ) రూ.

841 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు.పర్యటనలో భాగంగా ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్( YSR Government General Hospital ) ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

రూ.20 కోట్లతో నిర్మించిన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభించిన తరువాత డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ కు వెళ్లనున్న ఆయన అక్కడ సెంట్రల్ బౌల్ వార్డు, తరువాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్( YS Jayamma Shopping Complex ) ను ప్రారంభిస్తారు.

అనంతరం రూ.66 కోట్లతో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ తో పాటు ఆదిత్యా బిర్లా యూనిట్ ఫేజ్ -1 ను ప్రారంభించనున్నారు.

కాగా 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్లతో ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ ను నిర్మించారు.

ఇడుపుల పాయ కేంద్రంగా రూ.39.

13 కోట్లతో వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!