గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
TeluguStop.com
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇంఛార్జ్ లు హాజరుకానున్నారు.
ఇందులో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతల పనితీరుపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల భవిష్యత్ తేలనుందనే చర్చ జోరుగా సాగుతోంది.కాగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర సమయం గడుస్తున్న టార్గెట్ పూర్తి చేయని నేతలపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మామూలు ప్లాన్ కాదు భయ్యా.. టేబుల్ ఫ్యాన్‌పై సీసీ కెమెరా!