గోడిచర్ల నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం( Memantha Siddam )’ బస్సు యాత్ర 19 వ రోజుకు చేరుకుంది.

ఈ మేరకు ఇవాళ గోడిచర్ల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది.నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, యలమంచలి బైపాస్ మీదుగా సీఎం జగన్ అచ్యుతాపురం చేరుకోనున్నారు.

అక్కడే జగన్ భోజన విరామం తీసుకోనున్నారు.తరువాత నరసింగపల్లి మీదుగా చింతపాలెంకు బస్సు యాత్ర చేరుకోనుంది.

ఈ క్రమంలో చింతపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, రెబక మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది.

తరువాత చిన్నయ్యపాలెంకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది.అక్కడే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు.

అయితే సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు.

జుట్టు ఆరోగ్యానికి అండగా నిలిచే బెస్ట్ ప్రోటీన్ మాస్క్ ఇది.. నెలలో ఒక్కసారైనా ట్రై చేయండి!