సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..?: పోసాని
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) వ్యాఖ్యలకు వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కౌంటర్ ఇచ్చారు.
సీఎం జగన్ ను చంపుతా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినా ఎవరూ పట్టించుకోరే అని ప్రశ్నించారు.
ఎన్నో రోజులుగా జగన్ ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు.
రేపే నిన్ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు బహిరంగంగా అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగితే మీరే చేయించుకున్నారని చంద్రబాబు ఆరోపించారన్న పోసాని ఇది దుర్మార్గం కాదా అని నిలదీశారు.
ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సుజనా చౌదరి, సీఎం రమేశ్ ( Sujana Chaudhary, CM Ramesh )ఆర్థిక నేరస్థులని చెప్పారు.
ఈ విషయం అందరికీ తెలుసని వెల్లడించారు.అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా అని ప్రశ్నించారు.