CM Jagan : కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

మనం సిద్ధం అంటుంటే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సతీమణి సిద్ధంగా లేమంటున్నారని చెప్పారు.

కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారని తెలిపారు.నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని ఆయన వెల్లడించారు.

అయితే కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని చెప్పారు.ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటేస్తారా? లేక నాకు ఓటేస్తారా? అంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరో కొత్త వైరస్… అదిగాని పాజిటివ్ అయితే 3 రోజుల్లోనే మటాష్?