CM Jagan Bus Yatra : ఎల్లుండి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
TeluguStop.com
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలోని పార్టీలన్నీ ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎల్లుండి నుంచి వైసీపీ ( YCP ) ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.
ఈ మేరకు సీఎం జగన్ బస్సు యాత్రను( CM Jagan Bus Yatra ) ప్రారంభించనున్నారు.
మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.కాగా ఈ బస్సు యాత్ర కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఎల్లుండి ఇడుపులపాయంలో దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం జగన్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.
అనంతరం మేమంతా సిద్దం యాత్రను( Memantha Siddham Yatra ) ఆయన ప్రారంభించనున్నారు.
బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?